Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందుడికి గో ఆధారిత ప్ర‌కృతి నైవేద్యం: టిటిడి ఛైర్మ‌న్

Webdunia
శనివారం, 1 మే 2021 (16:22 IST)
తిరుమ‌ల శ్రీ‌వారికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం, కూర‌గాయ‌లు, బెల్లం, ప‌ప్పుదినుసుల‌తో త‌యారు చేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను నిత్య నైవేద్యంగా శ‌నివారం నుండి పునః ప్రారంభించిన‌ట్లు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్‌ మీడియాతో మాట్లాడుతూ గోవిందుడికి గో ఆధారిత ప్ర‌కృతి నైవేద్యం స‌మ‌ర్పించే సాంప్ర‌దాయం దాదాపు 100 సంవ‌త్స‌రాల క్రితం వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం, కూర‌గాయ‌లు, అర‌టిపండ్లు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితో త‌యారుచేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను స్వామివారికి నైవేద్యంగా స‌మ‌ర్పించ‌డం ద్వారా పూర్వ వైభ‌వాన్ని తెచ్చామ‌న్నారు.
 
భ‌క్తులు ప్ర‌తి రోజు స్వీక‌రించే ప్ర‌సాదానికి ఈ ప్ర‌సాదానికి రుచిలో చాలా తేడా ఉన్న‌ట్లు చెప్పారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ఆల‌యంలో శాశ్వ‌తంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పండించిన వంట స‌రుకుల‌తో నైవేద్యం స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు ఛైర్మ‌న్ వివ‌రించారు. అదేవిధంగా శ‌న‌గ‌లు, బెల్లంతో ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారు చేసిన‌ట్లు తెలిపారు. దీనిపై అధికారుల‌తో స‌మీక్షించి సేంద్రియ వ్య‌వ‌సాయం చేసే రైతులను గుర్తించి, వారి నుండి నేరుగా సేక‌రించేందుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తామ‌న్నారు.
 
టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, డా.నిశ్చిత, కృష్ణా జిల్లా పిన‌గూడురు లంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ ఛైర్మ‌న్ వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments