Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో అకృత్యాలు: డ్రగ్స్, మందు, పబ్లిక్ రొమాన్స్, పార్టీలు...?

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో డ్రగ్స్, బహిరంగ శృంగారం వంటి అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమరావతి ప్రాంతంలోని 25కి మించిన గ్రామాల్లోని పంట పొలాలు ఖాళీగా వుండటంతో విజయవాడ, గుంటూ

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (13:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో డ్రగ్స్, బహిరంగ శృంగారం వంటి అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అమరావతి ప్రాంతంలోని 25కి మించిన గ్రామాల్లోని పంట పొలాలు ఖాళీగా వుండటంతో విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి రాత్రిపూట ఇక్కడకు చేరుకున్న యువత ఓవరాక్షన్ చేస్తోంది. మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో.. పబ్లిక్‌గా శృంగారానికి పాల్పడుతున్నారు. 
 
అంతటితో ఆగకుండా ఇదేంటని ప్రశ్నించే స్థానికులను బెదిరించడంతో పాటు.. దాడికి పాల్పడుతున్నారు. ఇటీవలే తాడేపల్లి ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు.. ఓ యువతిని వెంట తీసుకొచ్చారని.. కానిస్టేబుల్ వారిని అడ్డుకోగా.. సదరు యువతి రేప్ చేయబోయావంటూ.. కానిస్టేబుల్‌పైనే ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఆ కానిస్టేబుల్ గ్రామంలోకి వెళ్లి స్థానికులను వెంటబెట్టుకుని వచ్చి వారికి బుద్ధి చెప్పి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
మరో ఘటనలో గంజాయి తాగుతూ.. నలుగురు యువకులు అమ్మాయితో కనిపించారు. వీరిని ప్రశ్నించిన రైతుపై దాడిచేశారు. ఇదే తరహాలో ఉండవల్లి గుహల నుంచి సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో మద్యం మత్తులో రోడ్డుపై బహిరంగ శృంగారం చేస్తున్న యువతీ, యువకుడిని సీఎం విధులు నిర్వహించడానికి వచ్చిన పోలీసు సిబ్బంది గట్టిగా మందలించి పంపించారు. 
 
ఇలాంటి ఘటనలే కాకుండా అర్థరాత్రి పూట ఆడా మగా తెలియకుండా పార్టీలు, బ్యాచ్‌ బ్యాచ్‌లుగా యువత విడిపోయి కొట్టుకోవడం వంటి అకృత్యాలు అమరావతిలో పెరిగిపోతున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఖాళీగా వున్న ప్రదేశాల్లో ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments