Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుబులు పుట్టిస్తున్న గులాబ్ తుఫాను - మూడు రోజులు జాగ్రత్త

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (13:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్యంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తుంది. గులాబ్ అని నామకరణం చేసుకున్న ఈ తుఫాను గోపాలపురానికి తూర్పు ఆగ్నేయంగా దాదాపు 500 కిలో మీటర్లు, కళింగపట్నానికి తూర్పుగా 600 కిలోమీటర్ల దూరానా కేంద్రీకృతమైంది. 
 
ఇది తీవ్ర వాయుగుండంగా మారి, మరి కొన్ని గంటలు పశ్చిమ వాయవ్యంగానే పయనించి అనంతరం పశ్చిమ నైరుతి దిశగా మరలి ఆదివారం సాయంకాలానికి దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్రల మధ్య తీరం దాటే అవకాశమందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో శనివారం ఒరిస్సా, కోస్తాంధ్రలలో అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. 
 
అలాగే ఆదివారం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 27 న కోస్తాంధ్రలో సాధారణ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఒడిసాలోనూ భారీ వర్షాలు కొనసాగుతాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. 
 
అయితే, ఈ వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారి ఆ తర్వాత తుపానుగా మారే అకాశమున్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ తుఫానుకు గులాబ్ అనే పేరు పెట్టారు. ఈ తీవ్రవాయుగుండం తుఫాను మారి విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈనెల 26న తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments