Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెథాయ్ తుపాను.. 28 మంది మత్స్యకారులు గల్లంతు..

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్‌ను పెథాయ్ తుఫాను అతలాకుతలం చేసింది. పెథాయ్ తుపాను తీరం దాటినప్పటికీ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవడంతో పాటు చల్లటి గాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తాకిడి నేపథ్యంలో 28 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. 
 
తుపాను రాకముందు నాలుగు పడవల్లో సముద్రంలోకి వెళ్లిన జాలర్లు, అక్కడే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దుమ్ములపేట, ఉప్పలంక, పర్లాపేటకు చెందిన 28 మంది జాలర్ల జాడ ప్రస్తుతం తెలియరావడం లేదని అధికారులు చెప్తున్నారు. దీంతో గల్లంతయిన జాలర్ల కోసం అధికారులు రంగంలోకి దిగి గాలింపును మొదలెట్టారు. అంతకుముందు సముద్రంలో ఓఎన్ జీసీ రిగ్ వద్ద చిక్కుకున్న ఏడుగురు జాలర్లను రక్షించగలిగారు. 
 
పెథాయ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే 23 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా పెథాయ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు పలు జిల్లాల్లో పంటలు నేలకొరగగా, అక్వా రైతులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments