Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవిటి - మూగ యువతిని ఎత్తుకెళ్లి రేప్ చేసిన కామాంధుడు

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:05 IST)
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఓ మూగ, చెవిటి యువతిని ఓ కామాంధుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ఈ యువతిని చెరబట్టి.. ఈ పాడుపనికి పాల్పడ్డాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం దొడ్డదేవరపాడు గ్రామానికి చెందిన నండ్రు ప్రకాశరావు (35) అనే వ్యక్తి శుక్రవారం పెగళ్లపాడు గ్రామంలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఇదే గ్రామానికి చెందిన 19 యేళ్ళ చెవిటి, మూగ యువతి ఉదయం 11 గంటల సమయంలో కిరాణా షాపు వద్దకు వచ్చి ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుక్కుని తిరిగి వెళ్తోంది. 
 
ఆ సమయంలో బజారు నిర్మానుష్యంగా ఉండటాన్ని గమనించిన ప్రకాశ రావు సదరు యువతిని బలవంతంగా ఎవరూలేని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ యువతి విలపిస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని సైగలతో వెల్లడించింది. 
 
దీంతో దిగ్భ్రాంతికి గురైన యువతి తల్లి.. సంఘటనా స్థలం వద్దకు వెళ్లి అతడి కోసం వెతికి... ఎవరూ కనిపించకపోవడంతో... పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ప్రకాశరావు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments