Webdunia - Bharat's app for daily news and videos

Install App

12వ అంతస్తు నుంచి దూకి గ్రాఫిక్స్ అని నిరూపించాలి : విజయసాయికి ఉమ కౌంటర్

Webdunia
గురువారం, 16 జులై 2020 (17:16 IST)
వైకాపా నేతలకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఓ సవాల్ విసిరారు. అమరావతి ఓ గ్రాఫిక్ అంటూ వైకాపా నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా నేతలు చెప్పినట్టుగా అమరావతి ఓ గ్రాఫిక్ అయితే... వైకాపా నేతలు 12వ అంతస్తు నుంచి కిందికి దూకాలని పిలుపునిచ్చారు. 
 
వైజాగ్ రూపురేఖలు మార్చేందుకు ఓ కొత్త మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోందని, గత ప్రభుత్వంలా గ్రాఫిక్స్ చూపించకుండా, సీఎం జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు దేవినేని ఉమ ఘాటుగా కౌంటరిచ్చారు. 
 
'మా నాయకుడు చంద్రబాబు ఐదేళ్లలో వైజాగ్ ఆదాయాన్ని రెండింతలు చేశారు. వైజాగ్‌ను ఐటీ, డేటా, ఫిన్‌టెక్ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు దాన్ని జగన్ ధ్వంసం చేస్తున్నాడు. ఇటీవలే మీ సహచరుడు బొత్స సందర్శించిన అమరావతిని గ్రాఫిక్స్ అంటున్న మీరు అక్కడి భవనాల 12వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి అవి గ్రాఫిక్సేనని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు నిరూపించకూడదు?' అంటూ ట్వీట్ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments