Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి కార్యాలయంగా డిజిపి ఆఫీస్‌ : నక్కా ఆనంద్‌బాబు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:04 IST)
డిజిపి కార్యాలయం వైసిపి కార్యాలయంగా మారిపోయిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి హత్యయత్నానికి వెళ్లిన ఎమ్మెల్యేకు 151 నోటీస్‌ ఇచ్చి పంపారన్నారు. తమ నాయకులపై మాత్రం ఎస్సి,ఎస్టి కేసు పెట్టారని తెలిపారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి విన్నవించేది ఏముంటుందని ఆయన నిలదీశారు. ఈ దారుణంపై పోలీస్‌ వ్యవస్థ సిగ్గుపడాలని నక్కా పేర్కొన్నారు.
 
గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విపరీణమలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా?, వ్యవస్దలు పనిచేస్తు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటికి దాడి వెళ్ళి మళ్ళీ దానిని సమర్దించుకోవడం సిగ్గు మాలిన చర్యన్నారు. పోలీసులు వాళ్ళ చర్యలను సమర్దించడం దుర్మార్గమన్నారు. డీజీపీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేసుకోవాలన్నారు.

నా భూతో.. నా భవిష్యతు అన్నట్టు ఈ ప్రభుత్వంలో ఎన్ని భూతులు తిడితే.. మీ భవిష్యతు అంతా బాగుంటుంది అనే రీతిలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యంగం ఇచ్చిన జీవించే హక్కును హరిస్తుందని మండిపడ్డారు.

టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్  మరియు ఆ రోజు దాడికి వచ్చిన వారిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments