Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ రాజకీయాలకు వచ్చేది లేదు.. ఇక సీన్లోకి విజయ్.. పదేళ్లకు ముందే ప్లాన్ చేశారా?

తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయాల్లో వస్తారనుకున్నారు. అయితే కమల్ కూడా ఈ మధ్య సోషల్ మీడ

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (17:05 IST)
తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటంతో.. సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయాల్లో వస్తారనుకున్నారు. అయితే కమల్ కూడా ఈ మధ్య సోషల్ మీడియా రాజకీయాలపై పెద్దగా స్పందించకుండా కామ్‌గా ఉండిపోవడంతో.. ఇక యంగ్ సూపర్ స్టార్.. తమిళనాడులో రజనీకాంత్‌కు తర్వాత గొప్ప ఫాలోయింగ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
 
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపే నేత కరువవడంతో.. నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని.. తమిళ ప్రజలు భావిస్తున్నారు. అందుకే సినీ తారల వైపు దృష్టి మరల్చారు. మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధి వంటి వారు సినిమా నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లో పాగా వేసినవారే కాబట్టి.. రాజకీయాల్లోకి సినీతారలు వస్తే మంచిదని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్‌ రాజకీయాల్లో వస్తారని జోరుగా ప్రచారం సాగింది. 
 
అయితే ఈ ప్రచారంపై విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో రావడం అంత సులభమైన పని కాదన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని తెలిపారు. పదేళ్ల క్రితమే తాను విజయ్‌ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించానని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ రాజకీయాల్లోకి రాకకూడదని నిర్ణయించుకున్నట్లు చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments