Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ మంగరాజు ఏం చేశాడో చూడండి... వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

జాతిపిత మహాత్మా గాంధీ రోజున పోలీసు శాఖ పరువు తీశాడో కానిస్టేబుల్. ఇంతకీ ఆ కానిస్టేబుల్ అగ్నిమాక శాఖలో పని చేస్తున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రోల్ కాల్‌లో పోలీసోళ్ళ పరువు తీశాడు.

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (12:58 IST)
జాతిపిత మహాత్మా గాంధీ రోజున పోలీసు శాఖ పరువు తీశాడో కానిస్టేబుల్. ఇంతకీ ఆ కానిస్టేబుల్ అగ్నిమాక శాఖలో పని చేస్తున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రోల్ కాల్‌లో పోలీసోళ్ళ పరువు తీశాడు. ఆ కానిస్టేబుల్ పేరు మంగరాజు. రోల్ కాల్‌కు పూటుగా తాగి వచ్చి డ్రిల్ చేశాడు. ఈ డ్రిల్‌ను చూసిన సహచర సిబ్బందే కాదు... అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. దీంతో ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉన్నతాధికారులు రానున్నారంటూ విశాఖపట్టణంలోని గంట్యాడ అగ్నిమాపక కార్యాలయ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా రోల్ కాల్‌లో డ్రిల్ నిర్వహించారు. ఇందులో కానిస్టేబుల్ మంగరాజు చేసిన డ్రిల్ చూసినవారు నవ్వాపుకోలేకపోతున్నారు. అప్పటికే పూటుగా తాగి వచ్చిన మంగరాజు లైన్‌లో నిల్చునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అంతేకాక, ఉన్నతాధికారి ఇచ్చిన సూచనలు పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
 
ఒక దశలో కాళ్లు తొట్రుపడటంతో పక్కలైన్లో నిల్చున్న సహోద్యోగిపై పడబోయాడు. మరోసారి ఏకంగా సూచనలిస్తున్న పైఉద్యోగిపై పడబోయాడు. ఇంకోమారు గుండ్రంగా తిరిగి తమాయించుకోలేక పక్కనే పార్క్ చేసివున్న టూవీలర్‌పై పడిపోయాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నిజానికి గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధం. మరి మంగరాజుకు మధ్యం ఎక్కడ నుంచి వచ్చిందో పాపం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments