Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిద్దరం ఏకాంతంగా గడిపేద్దాం... రా... అంటుంది, వచ్చాక చుక్కలు చూపిస్తుంది...

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాంబాబుకు ఫేస్ బుక్ అంటే పిచ్చి. రాంబాబు ఒక రియల్టర్. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఫేస్‌బుక్‌ను 20సార్లకు పైగా ఓపెన్ చూసి చూస్తుంటాడు. ఆ ఫేస్‌బుక్ పిచ్చే చివరకు అతని ప్రాణాల మీదకు తెచ్చింది. రాంబాబు నివాసముంటున

Webdunia
గురువారం, 5 జులై 2018 (18:36 IST)
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రాంబాబుకు ఫేస్ బుక్ అంటే పిచ్చి. రాంబాబు ఒక రియల్టర్. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఫేస్‌బుక్‌ను 20సార్లకు పైగా ఓపెన్ చూసి చూస్తుంటాడు. ఆ ఫేస్‌బుక్ పిచ్చే చివరకు అతని ప్రాణాల మీదకు తెచ్చింది. రాంబాబు నివాసముంటున్న అదే ప్రాంతానికి చెందిన రూప అనే యువతి అనాథ. చిన్నప్పటి నుంచి అనాధాశ్రమంలో జీవించిన రూప కొంతమంది స్నేహితులతో కలిసి బయటకు వచ్చేసింది. డబ్బులను ఎలాగైనా సంపాదించి జల్సా చేసుకోవాలని స్నేహితురాళ్ళతో కలిసి ఒక ప్లాన్ చేసింది. అదే ఫేస్‌బుక్ ఛాటింగ్. ఇందులోనే ఇరుక్కుపోయాడు రాంబాబు. 
 
తన ఫోటోతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి కొంతమంది యువకులకు మెసేజ్‌లు పంపించడం ప్రారంభించింది రూప. బాగా దగ్గరైన యువకుల నెంబర్లను పర్సనల్ తీసుకొని వాట్సాప్ ద్వారా వారితో పరిచయం మరింత పెంచుకునేది. వారి వివరాలు తీసుకున్నాక ఇద్దరం ఏకాంతంగా గడుపుదాం.... ఒక ప్రాంతానికి రమ్మంటుంది. అతను అక్కడికి వచ్చిన తరువాత తనతో పాటు తీసుకువచ్చిన కిరాయి హంతకులను బయటకు రమ్మని అతని వద్దనున్న డబ్బులు, నగలను దోచుకుని వెళ్ళిపోయేది రూప. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా ఇలా చేస్తూ వచ్చింది రూప. ఈమె ఉచ్చులో ఎంతోమంది యువకులు ఇరుక్కున్నారు. 
 
అయితే రాంబాబు విషయంలో మాత్రం రూప ఇరుక్కుంది. ఎప్పటిలాగే రూప కంకిపాడుకు రాంబాబును రమ్మంది. అక్కడికి రాంబాబుకు రాగానే కిరాయి గూండాలు బెదిరించడం మొదలెట్టారు. తన వద్దనున్న చైను, ఉంగరాలను ఇమ్మని బెదిరించారు. అయితే రాంబాబు వారి నుంచి తప్పించుకుని పరుగెత్తుకుని వెళుతుండగా రాయి తగిలి కిందపడి చనిపోయాడు. రాంబాబు చనిపోయిన తరువాత రూప, కిరాయి గూండాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ రాంబాబు మరణంపై పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. రూప బాగోతం బట్టబయలైంది. ఇప్పుడు ఆ కిలాడీ లేడీ ఊచలు లెక్కిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments