Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుకు కూతవేటు దూరంలో.. పట్టపగలు... నడి రోడ్డుపై నరికేశారు... ఎక్కడ? (Video)

రాయలసీమ జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలు పురుడు పోసుకుంటున్నాయి. గతవారం కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఇద్దరు కీలక నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందు.. గురువారం కడప జి

Webdunia
గురువారం, 25 మే 2017 (12:42 IST)
రాయలసీమ జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలు పురుడు పోసుకుంటున్నాయి. గతవారం కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఇద్దరు కీలక నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందు.. గురువారం కడప జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య జరిగింది. పట్టపగలు, నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
పొద్దుటూరుకు చెందిన మారుతీ ప్రసాద్ రెడ్డి కుటుంబంలోని మహిళతో అక్రమ సంబంధం విషయంలో నలుగురు వ్యక్తులతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో కోర్టు వాయిదా కోసం మారుతీ ప్రసాద్ రెడ్డి వస్తున్న సమయంలో నలుగురు ప్రత్యర్థులు అతనిని అడ్డుకుని ఘర్షణ పడ్డారు. 
 
ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆ నలుగురూ మారుతీ ప్రసాద్ రెడ్డిని కత్తులతో పొడిచారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసిన మారుతీ ప్రసాద్ రెడ్డిని వెంబడించి, నడి రోడ్డుపై కిందపడేశారు. ఆ తర్వాత ఒకరు తల పట్టుకుంటే.. మరొకరు కత్తితో మెడపై అనేక సార్లు దాడి చేశాడు. దీంతో ప్రసాద్ రెడ్డి హత్యా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇది అత్యంత పాశవికంగా... గొడ్డును చంపినట్టు అందరూ చూస్తుండగా నరికి చంపారు. ఈ దారుణం గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ హత్య జరుగుతున్న సమయంలో అనేక మంది రోడ్డుపై ఉన్నా.. వారి ఏ ఒక్కరూ కూడా అడ్డుకున్న పాపాన పోలేదు. ఈ హత్య పొద్దుటూరు కోర్టుకు కూతవేటు దూరంలో జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments