Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ఎగిరే పాము... ఎలా పట్టుకున్నారంటే?

హైదరాబాద్ నగరంలో ఎగిరే పాము కనిపించింది. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో కనిపించని ఈ పాము హైదరాబాదులో కనిపించే సరికి.. ప్రజలు జడుసుకున్నారు. షట్టర్‌ కింద దాక్కున్న ఈ పామును ఫ్రెండ్స్‌ అండ్‌ స్నేక్‌ సొసైటీ

Webdunia
గురువారం, 20 జులై 2017 (16:16 IST)
హైదరాబాద్ నగరంలో ఎగిరే పాము కనిపించింది. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో కనిపించని ఈ పాము హైదరాబాదులో కనిపించే సరికి.. ప్రజలు జడుసుకున్నారు. షట్టర్‌ కింద దాక్కున్న ఈ పామును ఫ్రెండ్స్‌ అండ్‌ స్నేక్‌ సొసైటీ వాళ్లు పట్టుకుని సైనిక్‌పూరిలోని సంరక్షిత కేంద్రానికి తరలించారు. విషపూరితమైన ఈ పాము  ఉత్తరప్రదేశ్‌, ఈశాన్యరాష్ట్రాలు, కొన్ని ఆసియా దేశాలు, పశ్చిమ కనుమలు, బీహార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌‌లలో కనిపిస్తాయి. 
 
కాగా.. ఎగిరేపామును పట్టుకున్న ఫ్రెండ్స్‌ అండ్ స్నేక్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఘోషామహల్‌లోని ఓ దుకాణ యజమాని తమ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసినట్లు చెప్పారు. దీంతో అక్కడికి చేరుకున్న తమ టీమ్.. పామును పట్టుకునే ప్రయత్నం చేశామని... తాము మొదట అది రాట్‌ స్నేక్‌ లేదా కోబ్రా అవ్వొచ్చని భావించామన్నారు. 
 
కానీ, తమ అంచనాలను పటాపంచలు చేస్తూ ఫ్లయింగ్‌ స్నేక్‌ కనిపించిందని వెల్లడించారు. జాగ్రత్తగా దాన్ని పట్టుకుని సైనిక్‌పురిలోని తమ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత పామును సంరక్షిత కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments