Webdunia - Bharat's app for daily news and videos

Install App

'Why Kattappa killed Baahubali?' ఈ టెన్షన్‌తో డ్యూటీ చేయలేకపోతున్నా.. వాట్సప్‌లో ఖాకీ సెలవు చీటీ

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి' మేనియా సాగుతోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ "బాహుబలి" కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నదే ప్రధాన చర్

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (11:38 IST)
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి' మేనియా సాగుతోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ "బాహుబలి" కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్ ఏకంగా వాట్సాప్‌లో సెలవు చీటీని తన పై అధికారులకు పంపారు. ఈనెల 28వ తేదీన విడుదలయ్యే బాహుబలి చిత్రాన్ని చూసేందుకు తనకు సెలవు మంజూరు చేయాలంటూ కోరారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వాట్సాప్ సెలవు చీటీ వివరాలు పరిశీలిస్తే... 
 
వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండకు చెందిన ఏ. విజయకుమార్ అనే కానిస్టేబుల్ ఈ సెలవు చీటీని రాశారు. "నా పేరు విజయ్‌కుమార్ (పీసీ 1511)‌, గీసుకొండ పోలీసు స్టేషన్‌నందు డ్యూటీ చేయుచున్నాను. నా యొక్క మనవి ఏమనగా... గత రెండు సంవత్సరాల నుండి డ్యూటీపై కాన్సన్‌ట్రేట్ చేయలేక పోతున్నాను. ఎందుకంటే.. "Why killed kattappa to baahubali". ఇట్టి విషయంతో డ్యూటీపై ఏకాగ్రత చేయలేక పోతున్నాను.
 
కావున ఈనెల 28వ తేదీన విడుదల అవుతున్న బాహుబలి చిత్రాన్ని చూసేందుకు మార్నింగ్ షోకు వెళ్లి నా యొక్క సందేహము తీర్చుకొనుటకుగాను ఒక్కరోజు అనగా 28-4-2017 రోజున సీఎల్ మంజూరు చేయగలరని నా యొక్క ముఖ్య ప్రార్థన" అంటూ ఆ కానిస్టేబుల్ తన లేఖలో పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments