Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫామ్-7 తెచ్చిన తంటా : జగన్‌కు ఓటు ముప్పు

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (12:53 IST)
దొంగ ఓట్లను పరిశీలించి వాటిని తొలగించాలని తామే ఫామ్‌-7 దరఖాస్తులు ఇచ్చామని గొప్పగా చెప్పుకొస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఓటుకే సమస్య వచ్చి పడింది. తన ఓటును తొలగించాలని ఆయనే దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల అధికారికి ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 ద్వారా ఒక వినతి వచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు పులివెందుల ఎన్నికల అధికారి(ఆర్వో) సత్యం మంగళవారం విలేకరులకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 
 
'పులివెందులలోని 134 బాకరాపురం పోలింగ్‌ కేంద్రంలో జగన్‌కు ఓటు హక్కు ఉంది. ఈ ఓటును తొలగించాలని జగనే స్వయంగా దరఖాస్తు చేసుకున్నట్లు ఫామ్‌-7లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు వచ్చింది. దీనిని చూడగానే జగన్‌ బంధువైన జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చాం. ఆయన జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని ఆర్వో చెప్పారు. 
 
అయితే ఓటు తీసేయాలని తాను ఫామ్‌-7 దరఖాస్తు చేయలేదని జగన్‌ బదులివ్వడంతో గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ పని చేసారని భావించిన ఆర్వో కలెక్టర్‌ హరికిరణ్‌కు సమస్యను నివేదించారు. అనంతరం కలెక్టర్‌ ఆదేశాల మేరకు పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలావుండగా.. తాను ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 దరఖాస్తు చేయలేదంటూ లిఖితపూర్వకంగా బదులివ్వమని కూడా జగన్‌కు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments