Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిలకు ఉచితంగా బ్రాండెడ్ కంపెనీ శానిటరీ నేప్‌కిన్స్‌: జగన్

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (10:19 IST)
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.

సమావేశానికి విద్య, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్థినిలకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

మార్చి 8 (మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకం ప్రారంభం కానున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. అయితే ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి  ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కాగా నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ప్రభుత్వం‌ పంపిణీ చేయనుంది. దీని కోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనుంది. తక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్ గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్స్‌ ద్వారాతక్కువ ధరకే శానిటరీ నేప్‌కిన్స్‌ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు.

చేయూత స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో  బ్రాండెడ్ కంపెనీల శానిటరీ నేప్‌కిన్స్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం శానిటరీ నాప్‌కిన్స్‌ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో  మెప్మా, సెర్ప్‌ ఎంఓయూ ఏకం కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిలకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు.

దీనికోసం లాప్‌టాప్‌లను వాడుకోవాలన్నారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9 తరగతి ఆపైన విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్‌ ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్స్‌తో పాటు రెప్యూటెడ్‌ సంస్ధలు (కోచింగ్‌ ఇనిస్టిట్యూషన్స్‌) సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ల్యాప్‌టాప్‌ల సహకారంతో కోచింగ్‌ ఇవ్వాలన్నారు. ఇంటరాక్టివ్‌ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.

దీని ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. లాప్‌టాప్‌లను  విద్యార్థినిలకు ఇచ్చే సమయానికి దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments