Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆగస్టు 16 నుంచి డిగ్రీ విద్యార్థులకు టీకా

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:26 IST)
ఏపీలో ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే డిగ్రీ విద్యార్ధులకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఈ మేరకు కళాశాలల్లోనే వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఏర్పాటు చేయడానికి వైద్యఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో 2.92 లక్షల మండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులున్నారని అంచనా. కళాశాలలకు వెళ్లి వేయడం వల్ల వీరందరికి త్వరగా వేయడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆగస్టు 16కంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

దీనిలో భాగంగా విద్యాసంస్థల సిబ్బంది ఇప్పటి వరకూ ఎంత మంది రెండు డోసులు టీకా వేసుకున్నారు? ఎంత మంది తొలిడోసు టీకా వేసుకున్నారు.? ఇంకా ఎన్ని టీకాలు అవసరం అన్న వివరాలను అధికారయంత్రాంగం సేకరిస్తోంది. పూర్తిస్థాయి వివరాలు వచ్చిన తరువాత ప్రత్యేక డ్రైవ్‌గా ఉపాధ్యాయులకు. ఇతర సిబ్బందికి టీకాలు వేయనున్నారు.

ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న 1,68,911 మంది ఉపాధ్యాయుల్లో ఈ నెల 22వ తేదీ నాటికి తొలి విడత వ్యాక్సిన్‌ 83,394 (49.37శాతం) మంది వేయించుకున్నారు రెండో విడత వ్యాక్సినేషన్‌ 59,056 (34.96శాతం) మందికి జరిగింది. ఒక డోసు పూర్తయిన వారికి రెండోది అసలు వేసుకోని వారికి తొలిడోసు టీకాను ఈ నెల 31లోగా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments