Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూళ్లూరుపేట రైల్వే స్టేషనులో ప్రేమికులపై దాడి... యువతిపై గ్యాంగ్ రేప్...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:55 IST)
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మరో ఘాతుకం. స్త్రీని వివస్త్ర చేసి ఐదుగురు అత్యాచారం చేసారు. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో రాత్రి ఈ ఘటన జరిగింది. ఏకాంతంగా రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రేమ జంటపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన యువకుడు... బాధితురాలు శ్రీసిటీలో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. 
 
కొంతకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఊరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లో బోకారో ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ఎక్కేందుకు ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్ చివరన ఉన్న బెంచీపై కూర్చున్నారు. అటుగా వెళ్తున్న కామాంధుల కన్ను వారిపై పడింది. ప్లాట్‌ఫారమ్ నిర్మానుష్యంగా ఉండటంతో వారు చెలరేగిపోయారు. యువకుడిపై దాడి చేసి యువతిని లాక్కుని వెళ్లారు. 
 
బాధితురాలు కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా కనికరించకుండా తీసుకువెళ్లి వివస్త్రను చేసారు. రైలు పట్టాల వెంబడి కొట్టుకుంటూ వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుడు, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు. తీవ్ర రక్త స్రావం అయి అల్లాడుతున్న యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు విజయనగరం జిల్లావాసిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం