Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కాదంటే ఎన్నికల్లో పోటీ చేయను : మంత్రి గంటా శ్రీనివాసరావు

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (16:07 IST)
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదంటే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. 
 
బీసీ గర్జన సభ ఏలూరులో జరిగింది. ఈ సభ వైకాపా ఆధ్వర్యంలో జరిగింది. దీనిపై మంత్రి గంటా స్పందిస్తూ, బీసీ గర్జన సభను నిర్వహించేందుకు జగన్ అనర్హుడన్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా జగన్ నియమించలేదని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు బీసీ గర్జన పేరుతో హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
అదేసమయంలో తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి గంటా వివరణ ఇచ్చారు. అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతమాత్రం నిజం లేదనీ, వాటిని నమ్మవద్దని సూచించారు. 
 
తాను ఎమ్మెల్యేగా ఉండాలా? లేక ఎంపీగా వెళ్లాలా? అన్నది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. ఈసారి పోటీ చేయొద్దని ఏపీ సీఎం చంద్రబాబు చెబితే మానేస్తానని మంత్రి గంటా శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కొంతమంది గురించి మాట్లాడి తన ప్రతిష్టను దిగజార్చుకోనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments