Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరికి మళ్లీ వరద

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (08:08 IST)
గోదావరి మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం రాత్రి భద్రాచలం వద్ద 35 అడుగుల నీటిమట్టం నమోదైంది. మరింత పెరుగుతుందని జలవనరుల శాఖ అంచనా.

ఎగువన వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద గురువారం 9.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజీకి చెందిన 175 గేట్లను 0.70 మీటర్ల ఎత్తు లేపి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద పెరగడంతో రాజమహేంద్రవరంలోని బ్రిడ్జిలంక, కేదార్లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి.

సీతానగరం మండలం ములకల్లంక జలదిగ్బంధంలో ఉంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు నాలుగు వేల క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి వరద బుధవారం అర్థరాత్రి నుంచి ఒక్కసారిగా పెరగడంతో దేవీప్నటం మండలంలోని ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాఫర్‌ డ్యాం నుంచి వరద నీరు వెనక్కి వస్తుండటంతో తొయ్యేరు, పూడిపల్లి గ్రామాల్లోని దళితవాడలు, దేవీపట్నంలోని జాలరిపేట వద్ద ఇళ్లవద్దకు గోదావరి వరద చేరుతోంది.

ప్రధాన రహదారిపైకి వరద రావడంతో దేవీపట్నం, తొయ్యేరు, పెనికిలపాడు, మంటూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి ఆదేశించడంతో ఐటిడిఎ అధికారులు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments