Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు మెడకు కోర్టు ధిక్కరణ.. నోటీసుల జారీకి హైకోర్టు ఆదేశం

Webdunia
బుధవారం, 19 మే 2021 (14:24 IST)
సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఏపీ సర్కారు తీరుతో పాటు.. సీఐడీ ఉన్నతాధికారుల తీరును హైకోర్టు ఎండగట్టింది. 
 
ఈ నేపథ్యంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహరంలో సీఐడీ మెజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్‌ను రద్దు చేయాలని.. ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. 
 
ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments