హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (07:58 IST)
హౌరా నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య తిరిగే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించారు. కరోనా కారణంగా ఈ వీక్లి ఎక్స్‌ప్రెస్‌ రద్దయిన విషయం తెలిసిందే.  జూలై 7వ తేదీ నుం చి ఈ ఎక్స్‌ప్రెస్‌ తిరిగి పట్టాలు ఎక్కనున్నది.

02527 నెంబర్‌గల వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ జూలై 7వ తేదీ మధ్యాహ్నం 2.55 గంటలకు హౌరాలో బయలుదేరి 8వ తేదీ ఉదయం 9.25 గంటలకు విజయవాడకు, మధ్యాహ్నం 2.00 గంటలకు గిద్దలూరు చేరుకుని రాత్రి 10.20 గంటలకు సత్యసాయి ప్రశాంతి నిలయానికి చేరుతుంది.

తిరిగి ఇదే రైలు జూలై 9వ తేదీన 02528 నెంబర్‌తో  ఉదయం 7.40 గంటలకు సత్యసాయి ప్రశాంతి నిలయంలో బయలుదేరి మధ్యాహ్నం 1.48 గంటలకు గిద్దలూరుకు, సాయంత్రం 6.15 గంటలకు విజయవాడ, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు హౌరా వెళ్తుంది. వారానికి ఒక్కరోజు తిరిగే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒడిశా,  పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు నేరుగా వెళ్లే సౌకర్యం కలుగుతుంది. 

పలు రైళ్లు రద్దు:
 
కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల నుంచి ఆదరణ లభించని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాలేరు  డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
 
జూలై ఒకటి నుంచి 14 వరకు రద్దైన రైళ్లు
విశాఖ-రాయపూర్‌(08528), విశాఖ-కిరండోల్‌(08516), విశాఖ-కాచీగూడ (08561), విశాఖ-కడప/తిరుపతి(07488), విశాఖ-లింగంపల్లి(02831)
 
జూలై రెండు నుంచి 15 వరకు రద్దైన రైళ్లు
రాయపూర్‌-విశాఖ(08527), కిరండోల్‌-విశాఖ(08515), కాచీగూడ-విశాఖ (08562), కడప/తిరుపతి-విశాఖ(07487), లింగంపల్లి-విశాఖ(02832)
 
వీటితోపాటు జూలై రెండు నుంచి యశ్వంతపూర్‌-గుహవటి(06577), జూలై ఐదు నుంచి గుహవటి-యశ్వంతపూర్‌(06578) రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments