Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం నైలాన్ తాడుతో తమ్ముడిని చంపేసిన అన్న

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (09:42 IST)
ఆస్తి కోసం సొంత తమ్ముడినే అన్న చంపేశాడు. తన భార్యతో కలిసి తమ్ముడు మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆస్తి నల్లకుంట బాయమ్మ గల్లీలో వెంకటేశ్, రమేశ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వీరిద్దరూ ఆస్తి విషయమై గొడవపడ్డారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన గురువారం రమేశ్‌ తాగిన మత్తులో తన గదిలో నిద్రపోతుండగా అతని మెడకు నైలాన్ తాడు బిగించి అతని అన్న వెంకటేశ్, వదిన బబిత కలిసి హత్య చేశారు. 
 
ఈ విషయం ఇరుగుపొరుగు వారి ద్వారా పోలీసులకు సమాచారం చేరింది. దీంతో పోలీసులు వచ్చి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తీసుకుని విచారించగా, వారిద్దరూ హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో నిందితులైన వెంకటేశ్, బబితలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments