Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కాళ్ళు పట్టుకుంటావా? లేదా కేసు పెట్టి చంపుతా? (వీడియో)

ఎయిర్‌హోస్ట్‌ను ఇద్దరు పోకిరీలు లైంగికంగా వేధించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆమెపై పడేందుకు యత్నించారు. దీంతో ఆమె పోలీసుల వద్దకు వెళ్లడంతో సీన్ రివర్స్ అయింది. నా కాళ్లు పట్టుకుంటే వదిలేస్తా? లేదంటే కేసు పె

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (14:49 IST)
ఎయిర్‌హోస్ట్‌ను ఇద్దరు పోకిరీలు లైంగికంగా వేధించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఆమెపై పడేందుకు యత్నించారు. దీంతో ఆమె పోలీసుల వద్దకు వెళ్లడంతో సీన్ రివర్స్ అయింది. నా కాళ్లు పట్టుకుంటే వదిలేస్తా? లేదంటే కేసు పెట్టిమరీ చంపేస్తా అంటూ ఆ ఎయిర్‌హోస్ట్ ధైర్యంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆ అకతాయిలు మరోమార్గం లేకు ఆమె రెండు కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగి, అక్కడ నుంచి జారుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టస్‌గా ఓ అమ్మాయి పని చేస్తోంది. ఈమె శనివారం రాత్రి విధులు ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్‌లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె స్థానికంగా ఉన్న పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు.. పార్కింగ్ ప్లేస్‌లోనే ఉన్న ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు పట్టుకోవటంతో ఆ అకతాయిలు స్వరం మార్చారు. ఆ అమ్మాయిని వేడుకున్నారు. కేసు పెట్టొద్దని.. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్ అంటూ ఒకటికి వంద సార్లు ప్రాధేయపడ్డారు. అయినా ఆ అమ్మాయి కనికరించలేదు. దీంతో భరత్, కల్యాణ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా ఈ యువకులు చేతులు జోడించి వేడుకున్నారు. పొరపాటున జరిగిందని.. కావాలని మీద పడలేదని దండం పెట్టారు.
 
అయితే ఆ అమ్మాయి అంతటితో ఆగలేదు. చేసిన తప్పుకి కాళ్లు పట్టుకుని సారీ చెప్పాలని కోరింది. దీనికి కూడా ఆ యువకుడు ఓకే అన్నాడు. అమ్మాయి కాళ్ల ముందు ఒంగి సారీ చెప్పాడు.. అలా కాదు.. బెండ్ డౌన్.. బెండ్ డౌన్.. అప్పుడే వదిలేస్తా అని బెదిరించింది. లేకపోతే కేసు పెట్టి మరీ చంపుతా.. బెండ్ డౌన్.. కాళ్లు పట్టుకో.. కాళ్లు పట్టుకో నువ్వు.. నా కాళ్లకు చేతులు టచ్ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ యువకుడు అందరి ముందు కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరాడు. దీంతో ఆ యువతి కేసు పెట్టకుండా వదిలివేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం