Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోలీ ఆడుతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. తర్వాత...

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (09:34 IST)
హైదరాబాద్ నగరంలో ఓ కామాంధుడి చేతులో మరో చిన్నారి బలైపోయింది. హోలీ ఆడుతున్న ఆరేళ్ళ బాలికను ఓ మద్యం సేవించిన కామాంధుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ చిన్నారిని గొంతుపిసికి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ సమీపంలోని తుర్కపల్లి గ్రామంలో గురువారం హోలీ వేడుకలు జరిగాయి. తల్లీతండ్రి కూలి పనులకు వెళ్లారు. దీంతో ఆరేళ్ళబాలిక ఒక్కటే ఇంట్లో ఉంటూ, వీధిలో ఇతర చిన్నపిల్లలతో కలిసి హోలీ పండుగ ఆడుతోంది. 
 
ఆ సమయంలో పీకల వరకు మద్యం సేవించిన ఓ కామాంధుడు.. బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం జరిపి చంపేశాడు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె ఇంట్లో కనిపించలేదు. దీంతో ఇరుగుపొరుగువారిని విచారించారు. వారంతా తమకు తెలియదని సమాధానమిచ్చారు. 
 
దీంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ మాయమైనట్టు అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు వేశారు. విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌ శివార్లలో చనిపోయి ఉ‍న్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. 
 
నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు అతడిది బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాగా నిర్ధారించారు. నిందితుడిపై ఐపీసీలోని పోక్సో సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సైబరాబాద్‌ పోలీసులు మీడియాకు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments