Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో హైటెక్‌ పద్ధతిలో ''ఆ'' దందా.. ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో?

చికాగో సెక్స్ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులో హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార న

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (14:39 IST)
చికాగో సెక్స్ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాదులో హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార నిర్వహకుల నుండి ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలను కాపాడారు. ఈ వ్యభిచార గృహ నిర్వహకుడైన ఓ 24 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన భరత్ రెడ్డి(24) అనే యువకుడు శిరీష అనే మహిళ సాయంతో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. వీరు న్యూ బోయిన్ పల్లి ప్రాంతంలోని జయా ఎన్ క్లేవ్ జె.ఎస్.ఆర్ రెసిడెన్సీలో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. శిరీష ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి భరత్‌కు అప్పగించేది.
 
అతడు ఆ అమ్మాయిలను విటుల వద్దకు పంపించడం, విటులనే ఈ ప్లాట్‌కు రప్పించడం చేసేవాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ రైడ్‌లో ఈ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ముఠా భారి నుండి ముగ్గురు మహిళల్ని కాపాడిన పోలీసులు వారిని షెల్టర్ హోంకు తరలించారు. నిర్వహకుడు భరత్ రెడ్డితో పాటు విటులు జల్లి బాలపడిగ రావు(44),  ఉప్పలపాటి ఆకాశ్(24)లను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార గృహాన్ని పోలీసులు సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం