Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెలపై కన్నేశాడనీ... భర్తను హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య!

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (21:30 IST)
మొదటి భర్తకు పుట్టిన తన కుమార్తెలపై కన్నేశాడనీ రెండో భర్తను హతమార్చిందో భార్య. ఆ శవాన్ని ఏకంగా తన ఇంట్లోనే పాతిపెట్టి... భర్త కనిపించలేదని నాటకమాడింది. గత నెలలో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. 
 
ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ అగర్వాల్(38) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే గగన్ అగర్వాల్ తప్పిపోయినట్టుగా ఎల్బీ నగర్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ కేసును వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కి కేసును పోలీసులు బదిలీ చేశారు. 
 
గగన్ అగర్వాల్ మిస్సింగ్‌పై పీఎస్‌లో గగన్ భార్య, మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి అగర్వాల్ హత్యకు గురైనట్లు వనస్థలిపురం పోలీసులు తేల్చారు. ఈ కేసులో గగన్ అగర్వాల్ రెండో భార్య నౌసియా బేగం పోలీసులను మొదట తప్పుదోవ పట్టించింది. 
 
పోలీసుల విచారణలో వాస్తవాన్ని అంగీరించింది. అగర్వాల్‌ను తానే కత్తితో హత్య చేసి ఇంటి వెనుకాల పూడ్చి పెట్టినట్టు వెల్లడించింది. దీంతో ఇంట్లో ఉన్న అగర్వాల్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. 
 
అయితే కట్టుకున్న భర్తను నౌసియా హత్య చేయడానికి కారణం కూడా వివరించింది. తనకు మొదటి భర్త కారణంగా నలుగురు కూతుర్లు పుట్టారు. వారంతా ఇపుడు తనతో పాటే ఉన్నారు. 
 
అదేసమయంలో రెండేళ్ల క్రితమే మొదటి భార్యకు గగన్ అగర్వాల్ విడాకులు ఇచ్చాడు. గత జూన్‌లో నౌసిన్ బేగం(మరియాద)ను గగన్ అగర్వాల్ వివాహం చేసుకున్నాడు. మొదటి భర్తతో నౌసిన్ విడిపోయాక గగన్ అగర్వాల్, నౌసియా బేగం ఇద్దరు ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మన్సురాబాద్‌లోని అగర్వాల్ ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారు.
 
నౌసిన్ కూతుర్లపై తన భర్త గగన్ అగర్వాల్ ప్రవర్తన సరిగ్గా లేక  పోవడంతో హత్య చేసినట్లు నౌసియా వెల్లడించింది. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారో వారందరినీ అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments