Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ని సీఎంగా చూడాలనేది నా కోరిక... 30 ఇయ‌ర్స్ పృథ్వీ

వై.ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి సినీ న‌టుడు పృథ్వీ 2014లోను స‌పోర్ట్ చేసారు. ఈసారి కూడా పార్టీ త‌రపున ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. ఇటీవల జ‌గ‌న్‌ని పృథ్వీ క‌లిసారు. దీంతో అస‌లు జ‌గ‌న్ పార్టీకి పృథ్వీ స‌పోర్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. దీనిప

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (22:45 IST)
వై.ఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి సినీ న‌టుడు పృథ్వీ 2014లోను స‌పోర్ట్ చేసారు. ఈసారి కూడా పార్టీ త‌రపున ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తెలియ‌చేసారు. ఇటీవల జ‌గ‌న్‌ని పృథ్వీ క‌లిసారు. దీంతో అస‌లు జ‌గ‌న్ పార్టీకి పృథ్వీ స‌పోర్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ... వైసీపీ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి తను ప్రచారం చేయడం లేదన్నారు. 2014లోనూ తను వైసీపీ తరఫున ప్రచారం చేశానని.. కానీ అప్పట్లో ఏ పదవినీ తాను ఆశించలేదన్నారు. 
 
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న అభిమానంతోనే తను ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్ కాపులకి న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..? రైతులకి రుణమాఫీ చేస్తానని 2014లోనే జగన్ చెప్పి ఉంటే.. ఆయన సీఎం అయ్యుండేవారు. నేను ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్‌ను కూడా ఆశించడం లేదు. 2014లో చాలాచోట్ల ప్రచారం చేశాను. నన్ను జెండా మోసే సామన్య కార్యకర్తగా మాత్రమే చూడండి. జగన్‌ని సీఎంగా చూడాలనేది నా కోరిక. ఊపిరి ఉన్నంత వరకూ ఆయన వెంటే ఉంటాన‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments