Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశంలో చేరడం లేదు... వైసీపీలోనే కొనసాగుతా.. బుట్టా రేణుక

తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు.

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (06:13 IST)
తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. వైసీపీలోనే తాను కొనసాగుతానని, టీడీపీలో చేరనని తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని వెల్లడించారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు ఓ పథకం ప్రకారం కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
అంతకుముందు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి మరింత మంది జంప్ చేయనున్నారనే వార్తలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే. వీరిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఉన్నట్టు ప్రచారం జరిగింది. వీరితో పాటు మరో ముగ్గురు సీనియ్ నేతలు కూడా ఉన్నట్టు ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఇవన్నీ ఉత్తుత్తి వార్తలేనని తేలింది. 
 
కాగా, 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాను దాదాపు వైకాపా స్వీప్ చేయగా, ఆపై దివంగత భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ సహా పలువురు ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్లు కూడా గత కొద్దికాలంగా జంప్ జిలానీల జాబితాలో వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments