Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో ఐ.ఎ.ఎస్.ల బదిలీలు...గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శిని కూడా!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (10:49 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌చూ ఐ.ఎ.ఎస్. లు, ఐ.పి.ఎస్. ల‌ను బ‌దిలీ చేస్తోంది. దాదాపుగా వారం విడిచి వారం బ‌దిలీల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఎందుకిలా త‌ర‌చూ బదిలీలు చేస్తున్నార‌నే మీమాంశ అధికార వ‌ర్గాల్లో మొద‌లైంది.

తాజాగా, ఏపిలో ఐ.ఎ.ఎస్‌ల బదిలీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ కార్యదర్శి గా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా నియ‌మించారు. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. స్టేట్ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా రవిశంకర్‌ నారాయణ్ బ‌దిలీ అయ్యారు. పీయూష్ కుమార్ జీఏడీకి బదిలీ అయ్యారు. సీసీఎస్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద కార్యదర్శిగా ఉన్న ముకేశ్ కుమార్ మీనాను బ‌దిలీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఆయ‌న్నిపరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా పంప‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలున్నాయ‌ని భావిస్తున్నారు. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియాను నియ‌మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments