Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి రుతుపవనం ముందుగా వస్తోందంటే ప్రమాదమేనా... తర్వాత కరువు తప్పదా

మండువేసవిలో మలయమారుతం చల్లగా తాకితే వచ్చే ఆ సంతోషానుభూతిని మాటల్లో వర్ణించలేము. ఉక్కపోతతో ఉడికిపోయిన తెలుగు రాష్ట్రాలు అల్పపీడనం కారణంగా కాస్త చల్లబడ్డాయి. ఏ ప్రాంతంలో పడినా కుంభవృష్టి కురుస్తుంటడంతో భూమి భూమే చల్లబడుతోంది. ఈ మంచివార్తను వాతావరణ శాఖ

Webdunia
సోమవారం, 29 మే 2017 (07:19 IST)
మండువేసవిలో మలయమారుతం చల్లగా తాకితే వచ్చే ఆ సంతోషానుభూతిని మాటల్లో వర్ణించలేము. ఉక్కపోతతో ఉడికిపోయిన తెలుగు రాష్ట్రాలు అల్పపీడనం కారణంగా కాస్త చల్లబడ్డాయి. ఏ ప్రాంతంలో పడినా కుంభవృష్టి కురుస్తుంటడంతో భూమి భూమే చల్లబడుతోంది. ఈ మంచివార్తను వాతావరణ శాఖ చల్లగా తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాలు మరింత ముందుగా రావడానికి తోడ్పడుతోందని భారత వాతా వరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ నెల 30, 31వ తేదీల్లోనే రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని తెలిపింది. తర్వాత రెండు, మూడు రోజుల్లోనే తెలంగాణ సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తరించే అవకాశముందని వెల్లడించింది. ఇక పశ్చిమ మధ్య, దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలను కలుపుతూ తూర్పు బంగాళా ఖాతంలో వృద్ధిచెందిన అల్పపీడనం మరింత ఉధృతమై తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించింది.
 
బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాలు మరింత ముందుగా రావడానికి తోడ్పడుతోందని  ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ కేజే రమేశ్‌ చెప్పారు. వచ్చే 24 గంటల్లో కేరళ, మాల్దీవు లు, దక్షిణ అరేబియా సముద్రం, బంగాళా ఖాతంపైకి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం రాత్రికి మరింత ఉధృతమై తుపానుగా మారే అవకాశ ముందని.. మంగళవారం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో తీరం దాటవచ్చని చెప్పారు. దాని కారణంగా బంగ్లాదేశ్‌తోపాటు ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
 
రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబా ద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడినా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని.. ఇవి సాధారణ వర్షాలేనని వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి చెప్పారు. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కొద్దిరోజులుగా 45–46 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి.
 
కానీ ఇలా ముందస్తు వర్షాలు రావడం అంటే తర్వాతి కాలంలో వర్షాల లేని పరిస్థితి ఎదురవుతుందని వర్షం రాకపైనే వ్యవసాయంమీద నమ్మకం ఉంటే రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments