Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందిచ్చి యువతిపై అత్యాచారం

Webdunia
శనివారం, 31 జులై 2021 (09:39 IST)
నమ్మించి... మత్తుమందిచ్చి.. ఓ యువతి (19)పై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్లక్రితం చనిపోయింది. దీంతో కుటుంబ స్నేహితుడు, మంగళం బీటీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆ యువతి అలిపిరి పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది.

28వ తేదీ తనకు మాయమాటలుచెప్పి శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జికి నాగేంద్రబాబు తీసుకెళ్లాడని, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments