Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో 'జబర్దస్త్' నటుడు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. దీని అడ్డుకట్టకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం మాత్రం యధేచ్చగా తరలిపోతోంది. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్‍లో 'జబ

Webdunia
గురువారం, 12 జులై 2018 (12:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. దీని అడ్డుకట్టకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం మాత్రం యధేచ్చగా తరలిపోతోంది. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్‍లో 'జబర్దస్త్' నటుడుకి సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తిరుపతికి చెందిన ఈ ఆర్టిస్టు.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా నటించిన సినిమాకు కూడా భారీ మొత్తంలో ఫైనాన్స్ చేసినట్టు సమాచారం.
 
ఇతని గురించి పక్కా ఆధారాలు లభ్యంకావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నట్టు సమాచారం. తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్న ఆర్టిస్టు... గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను తరలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తాడట.  దీనికి సంబంధించి టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. దాంతో అతనిపై సుమారు 20 కేసులు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు టాస్క్‌పోర్స్‌ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన ఓ సినిమాకు ఫైనాన్స్‌ చేసిన వ్యక్తి కూడా ఇతనేనని స్పష్టంచేశారు. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్‌ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇతనితో పాటు మరి కొందరు విద్యార్థులు, చిన్న చిన్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రైవేటు ఉద్యోగులను అక్రమ రవాణాలో భాగస్వాములు చేసుకున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments