Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (18:15 IST)
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ చెల్లించారు. అక్టోబరులో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. రైతులకు తన వంతు ఎంత చేసినా తక్కువేనని జగన్ తెలిపారు. గత 18 నెలల్లో 90 శాతానికి పైగా తమ హామీలను నెరవేర్చామని తెలిపారు.
 
పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తామన్న జగన్ ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో రైతులను ఆదుకుంటామని తెలిపారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాము. పగటి పూట ఉచితంగా 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాము. ఇక రైతులకు బీమా కూడా తామే చెల్లిస్తున్నామని తెలిపారు.
 
147 అగ్రి ల్యాబులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పంటల కొనుగోలు కోసం 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో మొదటి విడత పాల సేకరణలో భాగంగా బల్క్ మిల్క్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments