Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్ జీవన్ మిషన్‌కు ఒక్క పైసా ఇవ్వని జగన్ సర్కారు

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (11:43 IST)
కేంద్రం ఇచ్చే నిధులను ఏపీ సర్కారు ఉపయోగించుకోవడం లేదని కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆయన సోమవారం మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాగోలేదన్నారు. కేంద్ర నిధులను ఏపీ సర్కారు వినియోగించుకోవడం లేదన్నారు. 
 
2021 నుంచి ఈ పథకం నిధులను ఏపీ వినియోగించుకోలేదని వెల్లడించారు. జల్ జీవన్ అమలులో పనితీరు సరిగా లేదని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి ఆయన రాజ్యసభలో వెల్లడించారు. ఈ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ - తెలంగాణ రాష్ట్రాల అప్పులు ఇపే... 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం 4.42 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పులు చేసిందని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. బీఆర్ఎస్ సభ్యుడు నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు. 2019-20 నుంచి 2022-23 వరకు తీసుకున్న అప్పుల వివరాలను వివరించింది. 2019 మార్చి నాటికి రాష్ట్ర అప్పుల విలువ రూ.2.64 కోట్లకు చేరిందని తెలిపారు. 2023 మార్చి నాటికి అప్పుల విలువ రూ.4.42 లక్షల కోట్లకు పెరిగిందని ఆమె చెప్పారు. 
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అప్పు 2019 నాటికి రూ.2.64 లక్షల కోట్లుగా ఉండగా ఇది 2023 నాటికి బడ్జెట్ అంచనా ప్రకారం రూ.4.42 లక్షల కోట్లకు చేరిందని ఆమె తెలిపారు. వివిధ రూపాలంలో ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పులను రాబట్టుకుంటుందని ఆమె వెల్లడించారు. ఏపీ సీడ్స్ నుంచి కూడా రూ.400 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నారని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments