Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితికి కొత్త నినాదం.. స్వదేశీ ఉత్పత్తులే వాడాలి.. జనసేనాని

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:14 IST)
జనసేన కొత్త నినాదానికి శ్రీకారం చుట్టింది. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులే వాడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితి నుంచే దీన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి నుంచి ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లుగా ప్రకటించారు. 
 
పండుగ కోసం ఏ వస్తువు కొన్నా.. అది ఎక్కడ తయారైందో చూడాలని పవన్ పిలుపు నిచ్చారు. మన ఉత్పత్తుల గిరాకీ కోసమే స్వదేశీ నినాదమని పవన్‌ స్పష్టం చేశారు. 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' నినాదం ఏ ఒక్క వర్గానికో కాదని.. దేశ ప్రజలందరి అభివృద్ధికి సంబంధించిందని చెప్పుకొచ్చారు. 'మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి..' ఇదే 'ఆత్మనిర్భర భారత్‌' అని పవన్‌ అభివర్ణించారు. 
 
అందుకే ఈ వినాయక చవితి నుంచే ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని జనసేన- భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని ఆయన పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments