Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తికరం... పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసే సబ్జెక్ట్... విజయేంద్రప్రసాద్ స్టోరీ కేక...

కొన్ని సినిమాల ప్రభావం ప్రజలపై మామూలుగా వుండదు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజీఆర్ , జయలలిత వంటివారు తమతమ సందేశాత్మక చిత్రాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఆగిపోయారు. ముఖ్యమ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (10:40 IST)
కొన్ని సినిమాల ప్రభావం ప్రజలపై మామూలుగా వుండదు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజీఆర్ , జయలలిత వంటివారు తమతమ సందేశాత్మక చిత్రాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఆగిపోయారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే వరకూ రాలేకపోయారు. దీనికి కారణం వారి వ్యక్తిత్వంతో పాటు రాజకీయ నేర్పు కూడా అవసరం. 
 
ఇదిలావుంటే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 2018 మార్చి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమాలు వదిలేసి రాజకీయాలకు అంకితమవుతారట. ఈ నేపధ్యంలో 2018 ఫిబ్రవరిలో ఆయన హీరోగా బలమైన సందేశాత్మక చిత్రం తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. 
 
ఇప్పటికీ ఈ సబ్జెక్టుపై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నారట. దాదాపు స్క్రిప్టు పూర్తయిందనీ, తుది మెరుగులు దిద్దుతున్నారని ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆ సబ్జెక్టును తెరపైకి ఎక్కించి, అందులో పవన్ కళ్యాణ్ నటిస్తే ఇక ఆంధ్రలో కేక పుట్టిస్తుందంటున్నారు. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఈ స్టోరీ వుంటుందనీ, అందువల్ల ఆ చిత్రంతో పవన్ సినీ ప్రపంచం నుంచి రాజకీయ ప్రపంచంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశిస్తారని అంటున్నారు. ఇటు తెదేపా, అటు వైకాపాలను కిందకి తోసి పవన్ కల్యాణ్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments