Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో కేసీఆర్ పర్యటన: మళ్లీ ఇద్దరు చంద్రులూ కలుస్తారా?

ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీ

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (10:54 IST)
ఇద్దరు చంద్రులు మళ్లీ కలవనున్నారు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. ఇదే జరిగితే  ఏపీ సీఎం చంద్రబాబు, టి. సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఏర్పడుతుంది. అయితే, వీరిద్దరి మధ్యా ఎటువంటి అధికారిక చర్చలూ ఉండవని సమాచారం. అక్టోబర్ 1వ తేదీన దివంగత పరిటాల రవి, సునీతల కుమారుడు వివాహం వెంకటాపురంలో జరుగనుంది. 
 
ఈ  వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనంత పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో చేరుకునే కేసీఆర్, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. దీంతో వెంకటాపురం ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.  వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments