Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ ఓ రౌడీ.. కిరణ్ రాయల్

సోషల్ మీడియాలో వైసీపీ, జనసేనల తిట్ల పురాణంపై జరిపిన చర్చా కార్యక్రమంలో భాగంగా జనసేన చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్.. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (09:38 IST)
సోషల్ మీడియాలో వైసీపీ, జనసేనల తిట్ల పురాణంపై జరిపిన చర్చా కార్యక్రమంలో భాగంగా జనసేన చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్.. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చరిత్ర అందరికి తెలిసిందేనని ఎద్దేవా చేశారు. 
 
నెల్లూరు జిల్లాలో ఆయనొక అవినీతిపరుడు, రౌడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటివారు పార్టీలో వుంటే ఉన్మాదులు తయారవుతారని రాయల్ ధ్వజమెత్తారు. దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం కన్వీనర్ నాగార్జున యాదవ్ స్పందిస్తూ.. జనసేన నేతలకు దమ్ముంటే అనిల్ కుమార్ యాదవ్‌పై చేసిన ఆరోపణలు నిరూపించాలి, లేదా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఇటీవల వైకాపా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ యాత్ర కేవలం వైసీపీని విమర్శించడానికే తప్ప ప్రజలకోసం పనిచేద్దామనే తాపత్రయం లేకపోవడం శోచనీయమన్నారు.
 
తాను పవన్‌కు అభిమానినే అన్న అనిల్ పవన్ చేస్తున్న కుళ్ళు రాజకీయాలు నచ్చకే మనసు చంపుకుని పవన్ కళ్యాణ్‌ను అభిమానించడం మానేస్తున్నానంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments