Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, లోకేష్‌లపై దుమ్మెత్తిపోసిన కొడాలి నాని...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:11 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను టార్గెట్‌ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని. లోకేష్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు. లోకేష్, చంద్రబాబు తోలు ఒలిచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చెప్పులు కుట్టిస్తా అంటూ ఫైర్ అయ్యారు. 
 
ఇక, లోకేష్ ఓ పిల్లపంది అంటూ మండిపడ్డారు కొడాలి నాని.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయిన లోకేష్ అధికారంలోకి వస్తాడా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు కాదు మేమే కుక్కల్ని కొట్టినట్లు కొడతామని హెచ్చరించారు. 
 
ఎయిడెడ్ స్కూళ్లను జగన్ కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అంటున్నారు.. ఈ స్కూళ్లు జగన్‌కు ఇస్తారా? ప్రభుత్వానికి ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. పులివెందులలోని సొంత స్కూల్‌నే జగన్ ప్రభుత్వానికి అప్పగించారని తెలిపిన ఆయన.. పాతిక వేల ఓటర్లు ఉన్న కుప్పంలో గెలవలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు పంచాయతీ స్థాయికి దిగజారి పోయాడు.. చంద్రబాబు ఓ పెద్ద కుక్క, గుంట నక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
కుప్పంలో టీడీపీ ఓడిపోవటం ఖాయం అంటూ జోస్యం చెప్పిన కొడాలి.. అనంతపురం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. టీడీపీ, వామపక్షానికి చెందిన విద్యార్ధి విభాగాలు ప్రవేశించటంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. పోలీసులపై రాళ్లు విసిరి విద్యార్థులు గాయపడేటట్లు చేశారన్నారు మంత్రి కొడాలి నాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments