Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగనవాడిలో కలెక్టర్ పిల్లలు.. రాహుల్ రాజ్‌పై ప్రశంసలు

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (17:22 IST)
ప్రైవేట్ స్కూళ్లకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనికోసం మధ్యతరగతి జనాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్స్‌లో చేర్పించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇక ఓ జిల్లాకు కలెక్టర్ అయిన అధికారి తన పిల్లలను ఇంకెంత పెద్ద స్కూల్‌లో చదివించగలరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కుమురంభీం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ మాత్రం విభిన్నంగా ఆలోచించి అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. కలెక్టర్ రాహుల్‌రాజ్‌ తన ఇద్దరు కుమార్తెలను అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఆ చిన్నారులు మూడు నెలలుగా జన్కాపూర్‌-1 అంగన్‌వాడీ కేంద్రానికి వస్తూ ఓనమాలు దిద్దడంతో పాటు తోటి పిల్లలతో ఆనందంగా ఆడుకుంటున్నారు.
 
దీనిపై అంగన్‌వాడీ టీచర్ అరుణ స్పందిస్తూ.. కలెక్టర్ పిల్లలు కూడా అందరితో పాటే తాము వండిన భోజనమే తింటున్నారని చెప్పారు. ఎంతో ఉన్నతంగా ఆలోచించిన కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌‌పై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments