Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా మీసాలు మెలేస్తే.. ఉన్నవి కాస్త ఊడుతాయ్: కొండా సురేఖ

తన నియోజకవర్గంలో కొంతమంది మీసాలు మెలేస్తున్నారని.. కొత్తగా మీసాలు మెలేస్తే ఉన్నవి కాస్త ఊడుతాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రత్యర్థులను సూటిగా హెచ్చరించారు. నాయకత్వ లక్షణాలనేవి పుట్టుకతో రా

Webdunia
బుధవారం, 4 జులై 2018 (11:55 IST)
తన నియోజకవర్గంలో కొంతమంది మీసాలు మెలేస్తున్నారని.. కొత్తగా మీసాలు మెలేస్తే ఉన్నవి కాస్త ఊడుతాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రత్యర్థులను సూటిగా హెచ్చరించారు. నాయకత్వ లక్షణాలనేవి పుట్టుకతో రావాలని, ఈ విషయంలో కొండా మురళి ఒరిజినల్‌ బ్రిడ్‌ అని తేల్చేశారు. హైబ్రిడ్‌ మనుషుల మాదిరిగా వచ్చిరాని వేషాలు వేస్తే సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. 
 
వరంగల్‌ ఎల్‌బీనగర్‌లోని అబ్నూస్‌ ఫంక్షన్‌ప్యాలెస్‌లో పాల్గొన్న సందర్భంగా కొండాసురేఖ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా తమకు ఇలాగే అందించాలని కోరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు మాట్లాడుతూ.. రంజాన్‌ పండుగ తరువాత ఈద్‌ మిలాప్‌ నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. 
 
వివిధ మతాల సమూహంగా ఈ వేడుక నిర్వహించుకోవడం అభినందనీయమని, ప్రతీ ఒక్కరు కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలని  మురళీధర రావు సూచించారు. తమ నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments