Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో మోసం.. పాప పుట్టాక దుబాయ్‌కి జంప్.. ఫోన్ చేస్తే చంపేస్తానన్నాడు..

ప్రేమ పేరుతో అమ్మాయిని లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. అమ్మను చేశాడు. పాప పుట్టాక ఆమెను వదిలి దుబాయ్ చక్కేశాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెంలో చోటుచే

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (16:14 IST)
ప్రేమ పేరుతో అమ్మాయిని లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని.. అమ్మను చేశాడు. పాప పుట్టాక ఆమెను వదిలి దుబాయ్ చక్కేశాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెంలో చోటుచేసుకుంది. అయితే దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోతు శ్యామల(25) సత్యభాస్కర్‌ ఇంటర్‌ కళాశాలలో చదువుతున్న సమయంలో స్థానిక ఇంతియాజ్‌ అలీతో పరిచయమైంది. శ్యామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకోకుండా కాపురం చేశాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఆపై ఆమెను వదిలించుకునేందుకు దుబాయ్ వెళ్ళిపోయాడు. 
 
దుబాయ్‌ వెళ్లిన తర్వాత కూడా కొంత కాలం ఫోన్‌లో మాట్లాడేవాడు. గత మూడేళ్లుగా ఫోన్‌ చేయకపోవడంతో పాటు తను ఫోన్‌ చేసినా తీయకుండా చంపేస్తానని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో ఆమె గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని బాధితురాలు వాపోతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments