Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త అడ్డుతొలగిస్తే.. పిలిచినపుడల్లా వస్తుంటా... ప్రియుడి మోజులో భార్య

భర్త అడ్డు తొలగిస్తే నీవు పిలిచినపుడల్లా వచ్చి సుఖాన్ని ఇస్తుంటా అని తన ప్రియుడుకి ఓ వివాహిత ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆమె భర్తను గొడ్డలితో నరికి చంపేశారు. ఈ దారుణం కర్నూలు జిల్లా వెల్దు

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (12:47 IST)
భర్త అడ్డు తొలగిస్తే నీవు పిలిచినపుడల్లా వచ్చి సుఖాన్ని ఇస్తుంటా అని తన ప్రియుడుకి ఓ వివాహిత ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఆమె భర్తను గొడ్డలితో నరికి చంపేశారు. ఈ దారుణం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... మండలంలోని ఎస్‌.బోయినపల్లి గ్రామానికి చెందిన మంగలి శివరాముడు(40)కు భార్య లక్ష్మీదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివరాముడు గ్రామంలో కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్య లక్ష్మీదేవి అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఆమెను హెచ్చరించాడు. ఇకలాభం లేదని భావించిన లక్ష్మీదేవి.. తన ప్రియుడితో కలిసి భర్త శివరాముడు హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రచించిన పథకం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న శివరాముడి తలపై గొడ్డలితో దాడి చేసి చంపేశారు. 
 
దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య లక్ష్మీదేవి ప్రయత్నించింది. బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా హత్య చేసినట్లు లక్ష్మీదేవి, రామకృష్ణలు నేరాన్ని అంగీకరించారు. దీంతోవారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments