Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుచి చూపించి దూరం పెట్టిందనీ... అంతం చేశాడు..

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (13:37 IST)
తనతో వివాహేతర సంబంధం కొనసాaగిస్తూ వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్టుండి దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను హత్య చేసి, ఏమి తెలియనట్టుగా గ్రామంలో తిరుగుతూ వచ్చాడు. అయితే, వారం రోజుల తర్వా అతని బండారం బయటపడటంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్యాపిలి మండల పరిధిలోని నల్లబల్లి గ్రామ శివార్లలో యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30)కు బోయవాండ్లపల్లె గ్రామానికి చెందిన రామ్మోహన్‌తో 15 యేళ్ళ క్రితం వివాహం జరిగింది. 
 
వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. అయితే అనారోగ్యం కారణంగా మూడేళ్ల క్రితం రామ్మోహన్‌ మృతి చెందాడు. దీంతో పుట్టింటికి చేరుకున్న రాధమ్మ స్వగ్రామంలోనే చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటోంది. 
 
ఈ క్రమంలో ఆమెకు అదేగ్రామానికి చెందిన ధనుంజయులు అలియాస్‌ అంజితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో రాధమ్మ కొద్ది రోజులుగా అంజికి దూరంగా ఉంటోంది.
 
దీన్ని జీర్ణించుకోలేక పోయిన అతను నల్లబల్లి గ్రామానికి చెందిన తన మిత్రుడు రంగస్వామితో కలసి రాధమ్మను హతమార్చాలని పథకం రచించాడు. వారిరువురూ కలిసి ఆమెను పొలాల వద్దకు తీసుకుని వెళ్లి రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 
 
శవాన్ని కనిపించకుండా చేసేందుకు గుట్టలో పెద్ద బండ రాళ్ల మధ్య ఇరుకైన సందులోకి ఇరికించారు. వారం రోజుల తర్వాత శవం పూర్తిగా కుళ్లిపోవడంతో దుర్వాసన వ్యాపించింది. దీంతో సమీప పొలాల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments