Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడికి డబ్బులు ఇవ్వలేం.. ల్యాప్‌టాప్ ఇస్తాం.. సీఎం జగన్ లేఖ

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:55 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఒకటి. ఈ పథకం కింద వచ్చే 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అమ్మ ఒడి లబ్దిదారులైన మహిళలకు డబ్బులు ఇవ్వలేమన్నారు. డబ్బులకు బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఈ మేరకు లబ్దిదారులను ఉద్దేశించి ఆయన ఓ లేఖ రాశారు. అదీకూడా 9 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ల్యాప్‌టాప్‌లు ఇస్తామని పేర్కొన్నారు 
 
ఈ ల్యాప్ టాప్‌లలో డ్యూయల్ కోర్‌కు సమానమైన ప్రాసెసర్‌తో పాటు 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్ ఉంటుందని, మార్కెట్లో దీని విలువ రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. 3 సంవత్సరాల వారంటీ ఉంటుందని, 7 రోజుల్లోనే రీప్లేస్‌మెంట్ లేదా రిపేర్ చేయిస్తామని హామీ ఇచ్చారు.
 
ఇక సీఎం రాసిన లేఖ ప్రతి కాపీని 9వ తరగతి పైన చదువుతున్న విద్యార్థుల తల్లులకు పంపించి, వారి అభిప్రాయం తెలుసుకుని ల్యాప్‌టాప్‌లను అందించాలని పాఠశాల విద్యా శాఖ ప్రాంతీయ విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఏప్రిల్ 10లోపు లేఖలను తల్లులకు పంపాలని, ఈ లేఖలోని అంశాలను వివరించి, వారి అభీష్టాన్ని రికార్డు చేయాలని, తిరిగి సమాధానంతో కూడిన లేఖలను 22వ తేదీలోగా స్కూల్ ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులకు అందించాలని అధికారులు ఆదేశించారు.
 
ఇక జగన్ రాసిన లేఖలో కోరుకుంటేనే ల్యాప్ టాప్ ఇస్తామని, లేకుంటే ఇస్తామన్న నగదును బ్యాంకు ఖాతాలో వేస్తామని జగన్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆన్ లైన్‌లో పాఠాలను వినవచ్చని, చదువుకు సంబంధించిన వీడియోలను చూడటంతో పాటు, డిజిటల్ బుక్స్ చదువుకోవచ్చని తెలిపారు. ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని వెతక వచ్చని, ఈ-మెయిల్స్ సౌకర్యం ఉటుందని, వివిధ రకాల ప్రోగ్రాములతో ప్రాజెక్టు పనులను చేసుకోవచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments