Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చిరుతపులి.. కేకలు.. పరుగులు

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:56 IST)
తిరుపతి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. అంతే విద్యార్థులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. తిరుపతి అలిపిరి సమీపంలోని కొండ దిగువన అటవీ జూ సమీపంలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఈ కాలేజీ క్యాంపస్‌లోకి అడవి నుంచి వచ్చిన చిరుతపులి అక్కడి చెట్టుపైకి ఎక్కింది. 
 
యూనివర్శిటీ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో అడవి నుంచి చిరుతలు తరచూ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశిస్తుంటాయి. దీని నివారణకు యూనివర్సిటీ చుట్టూ 8 అడుగుల ఎత్తులో ప్రహరీ గోడను నిర్మించారు. గత రాత్రి అడవి నుంచి చిరుతపులి అక్కడి చెట్టు ఎక్కి యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించింది. 
 
ఆపై ఆవరణలో పడి ఉన్న కుక్కను చిరుత చంపేసింది. కుక్క అరుపులు విని వాచ్‌మెన్ వచ్చి కేకలు వేశాడు. వాచ్‌మెన్‌ శబ్దం విని హాస్టల్‌లోని విద్యార్థులు కూడా పరుగున వచ్చారు. చిరుతను చూసి కొందరు విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీశారు.ఇంతలో కాంపౌండ్‌లోని చిరుతపులి అక్కడున్న చెట్టుపైకి ఎక్కి బయటకు దూకి పారిపోయింది. 
 
చిరుతపులి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తలుపు, కిటికీలకు తాళం వేసి గదిలోకి వుండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు యూనివర్సిటీకి వచ్చి చిరుతను పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. అలాగే చిరుతపులులు ఉన్నందున రాత్రి 7 గంటల తర్వాత హాస్టల్ నుంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments