Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య అనుమానిస్తోందని విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చంపేసిన భర్త..

ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అ

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (16:04 IST)
ఏపీలో నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా రాజమండ్రిలో భార్య తనను అనుమానిస్తుందని ఓ భర్త భార్యను చంపే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమండ్రి, మండిపేట మండలం ఏడిదలో దారుణం జరిగింది. మొగల్ సాహెబ్ అనే వ్యక్తి పాము విషాన్ని భార్య సహీదాకు ఇంజక్షన్ రూపంలో ఇచ్చి చంపేశాడు. సీతానగరంలోని పాములపట్టే వ్యక్తి నుంచి ఈ విషాన్ని సాహెబ్ కొనుగోలు చేశాడు. భార్య అనుమానిస్తోందని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి మొగల్ సాహెబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
 
 
మరోవైపు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రినే హత్య చేసేందుకు ఓ కొడుకు కట్టుకున్న భార్యతో కలిసి ప్రయత్నించాడు. తండ్రి నోట్లు పురుగుల మందు నోట్లో పోసి.. వంటిపై కిరోసిన్‌చల్లి నిప్పంటించేందుకు ఇరువురు యత్నించారు. తండ్రి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు బాదితుడిని కాపాడారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments