Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్నఫోటోలు తీసి.. ముందు తల్లి... తర్వాత కుమార్తె.. ఆపై పనిమనిషిపై అత్యాచారం...

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ కామాంధుడి పాపం పండింది. ఒక మహిళకు తెలియకుండా నగ్నఫోటోలు తీసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అవే ఫోటోలను కుమార్తెకు చూపించి ఆమెతో కామావాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత అదే ఇంట్లో పని చేసే పనిమనిషినీ వదిలిపెట్టలేదు. ఆమెపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుల్లో ఒకరైన పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ముద్దాయిగా తేలిన కామాంధుడికి జీవితకారాగార శిక్షను కోర్టు విధించింది. అలాగే, 2.60 లక్షల అపరాధం కూడా విధించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని బెల్లంపల్లిలో ఓ ఇంట్లో పనిచేసే మహిళతో షేక్‌ అన్వర్‌ అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఆమెను కలవడానికి వెళ్లే క్రమంలో ఒకరోజు ఆ ఇంటి యజమానురాలు దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీశాడు. ఈ ఫోటోలు ఆమెకు చూపించి కామవాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో కొడుకును చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది 2017లో జరిగింది. 
 
ఆ తర్వాత ఆమె కుమార్తెపై కన్నేశాడు. అనంతరం 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెకు తల్లి నగ్నఫొటోలు చూపించి, సోషల్‌ మీడియాలో పెడతానని భయపెట్టి బాలికపైన కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. వీరిద్దరిపైనే కాకుండా పని మనిషిపైన కూడా అన్వర్‌ లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
దీంతో బాధితులు బెల్లంపల్లి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి సీఐ నాగరాజు చార్జ్‌షీట్‌ వేశారు. విచారణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్రీరామ్‌ 16 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయికి జీవిత ఖైదుతోపాటు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్‌ సోమవారం తీర్పుచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం