Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తరఫున నాగ‌బాబు పోటీ చేస్తారా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ల‌గ‌డపాటి శ్రీధ‌ర్ నిర్మించ‌గా, మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు

Webdunia
బుధవారం, 2 మే 2018 (14:05 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ల‌గ‌డపాటి శ్రీధ‌ర్ నిర్మించ‌గా, మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు మీడియాతో మాట్లాడుతూ... ఇండస్ట్రీలో సమస్య తలెత్తినప్పుడు మెగా హీరోలు స్పందించలేదు అనే వార్తల్లో నిజం లేదన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించినప్పుడు వ్యక్తిగతంగా తాము జోక్యం చేసుకోవడం ఎందుకనే భావనతో ఉన్నామని చెప్పారు.
 
 ఏదైనా వివాదం చెలరేగినప్పుడు ఫ్యాన్స్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదని... తమ పరిధిలో ఉన్నవారిని మాత్రమే నియంత్రించగలమని, లక్షలాది మంది అభిమానుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే, దానికి తమను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదని... అసలు ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. కానీ... నాగ‌బాబు జ‌న‌సేన తరుపున ప్ర‌చారం కానీ.. పోటీ కానీ చేసే ఛాన్స్ ఉంద‌ని మాత్రం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments