Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే.. అమ్మ, నాన్న అని పిలవండి: వెంకయ్య 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. చట్టంలో చెప్పిన వాటిని నూటికి నూరుశాతం అమలు చేస్తామని, చట్టంలో చెప్పని వాటిని కూడా అమలు చేస్తామని స

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (12:46 IST)
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. చట్టంలో చెప్పిన వాటిని నూటికి నూరుశాతం అమలు చేస్తామని, చట్టంలో చెప్పని వాటిని కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిని గ్రేటర్‌ అమరావతిగా మారుతుందని చెప్పారు. కాగా ఈ రోజు ఆయ‌న అమ‌రావ‌తి ప్రాంతంలోని ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క‌లిసి శంకుస్థాపన చేశారు.
 
ఈ సంద‌ర్భంగా వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ..''పిల్ల‌ల‌కు తెలుగు నేర్పించండి.. తెలుగు మ‌ర్చిపోతే అమ్మ‌ను కూడా మ‌ర్చిపోతారు. ఇంగ్లిష్ నేర్చుకోవాలి కానీ, ఇంగ్లిష్ వారి బుద్ధులు తెచ్చుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని భాష‌లు నేర్చుకోవాలి. మ‌మ్మీ, డాడీ, డ‌మ్మీ అని అన‌కూడ‌దు.. చ‌క్క‌గా తెలుగులో అమ్మ‌, నాన్న అనాలి. అమ్మ అనే పదం క‌డుపులోంచి వ‌స్తుంది. అదే ఇంగ్లీషులో మ‌మ్మీ అంటే గొంతులోనుంచి మాత్ర‌మే వ‌స్తుంది అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 
 
తెలుగు వాడిగా పుట్టినందుకు తాను గ‌ర్విస్తున్నాన‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. ప్ర‌పంచంలోని ఎన్నో సంస్థ‌ల‌కు అధిప‌తులుగా భారతీయులే ఉన్నార‌ని, అందులోనూ తెలుగు వారే ఎక్కువ‌గా ఉన్నార‌ని వెల్లడించారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని చెప్పారు. దేశం ముందుకెళ్లాలంటే విద్య‌, వైద్యం, ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారం కావాల‌ని అన్నారు. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments